
జనంన్యూస్. 23.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హన్మాండ్లు సూచనలతో నిజామాబాదు రురల్ ధర్పల్లి మండల కేంద్రం కు చెందిన సాంబేటి సుమన్‌ను జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల సందీప్ పటేల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి, అంకితభావంతో పని చేసే నాయకులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు.సంబటి సుమన్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.కొత్త బాధ్యతలు చేపట్టిన సుమన్ మాట్లాడుతూ… పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానని, గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయడానికి శ్రమిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సుమన్ గతంలో క్యూ న్యూస్ రిపోర్టర్ గా కూడా పనిచేశారు.