మెదక్ డీఈవో రాధా కిషన్.
జనం న్యూస్ రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ వినయ్ కుమార్ : ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్ప వని మెదక్ డిఇఓ రాధా కిషన్ అన్నారు.బుధవారం రేగోడు ఉన్నంత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజర్ రిజిస్టర్ను రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరుకావాలని బడి సమయపాలన ను పాటించాలని సూచించారు హాజరు చేసుకుని బయట తిరుగుతు సొంత పనులు చూసుకుంటే చర్యలు తప్పవు అన్నారు, బడి వేళల సమయంలో ఉపాధ్యాయులందరూ బడిలో ఉండాలని అన్నారు . కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుదర్శన్ మూర్తి, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ , సిఆర్పి సంతోష్ కుమార్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.