
జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అసెంబ్లీ ముట్టడి కి బయలుదేరిన ఐజ పట్టణ వడ్డెర నాయకులను, & విద్యార్థి నాయకుల హౌస్ అరెస్ట్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ పరిధిలోని వడ్డెరల ఆత్మగౌరవ పోరాటం నేడు అసెంబ్లీ గడప తొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయడం అత్యంత హేయమైన చర్య. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు పిలుపు మేరకు, నేడు జరగబోయే 'అసెంబ్లీ ముట్టడి' కార్యక్రమానికి వెళ్లకుండా ఐజ పట్టణ పోలీసులు బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు వడ్డే వీరేష్ మరియు వడ్డెర సంఘం అయిజ మండల అధ్యక్షులు మేస్త్రి వీరేష్ ని ఉదయం హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. సంకెళ్లతోను, అరెస్టులతోను వడ్డెర బిడ్డల పోరాట పటిమను తగ్గించలేరు. అక్రమ అరెస్టులు చేసిన కొద్దీ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. తక్షణమే వడ్డెర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే వడ్డెరల సంక్షేమానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి మా హక్కులను కాపాడాలి. ఓట్ల కోసం వడ్డెరలను వాడుకుని, అధికారంలోకి వచ్చాక హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం.ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి, వడ్డెరల న్యాయమైన కోరికలను తీర్చాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెర బిడ్డలు ఐక్యమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు.జై వడ్డెర! జై ఆత్మగౌరవ పోరాటం!