
జనం న్యూస్ మార్చ్ 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట్ మండలంలోని డా.హన్మయ్య, పేరు వింటే మండలం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలియనివారు ఉండరు. అంత గొప్పగా వైద్య సేవలు అందించి ప్రజలను సొంత వాళ్ళ లాగా వైద్యంతో పాటు మంచి చెడ్డలు తెలుసుకొని ఓదార్చిన వ్యక్తి డాక్టర్ హన్మయ్య. పేదవారికి జ్వరం వస్తే మొట్టమొదటగా గుర్తుకు వచ్చి హన్మయ్య, ఆయన దగ్గరికి వెళితే చాలు రోగం నయమైతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి వరుస కట్టి మరి వైద్య సేవలు చేయించుకున్నారు. ప్రజలు గొప్ప వ్యక్తిని కోల్పోయారు.డా. శంకర్, మల్కాపూర్.శంకర్ గ్రామం తో పాటు పక్క గ్రామమైన అంబర్పేట లో సుమారు 30 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించి అక్కడి గ్రామంలో ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటూ వారి రోగాన్ని నయం చేసిన గొప్ప వ్యక్తి. మల్కాపూర్ గ్రామంలో పుట్టి వైద్య వృత్తిని నేర్చుకుని మరణించేటంతవరకు వైద్య సేవలు అందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిన వ్యక్తి శంకర్,డా. నాగిరెడ్డి బీబీపేట బీబీపేటలో 50 ఏళ్లకు పైబడిన వారికి డా నాగిరెడ్డి తెలియని వాళ్ళు ఉండరు. వైద్యంలో తమకంటూ మంచి పేరు సంపాదించి సేవలు అందించిన వ్యక్తి. బీవీపేట్ మండల వాసులు పై ముగ్గురిని కోల్పోయాం అనే బాధ ప్రజల్లో మనసుల్లో నెలకొంది.