
జనం న్యూస్ మార్చి 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం
పేట మండలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలం లో 15 సార్లు అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.అసెంబ్లీ సమావేశాలు ఓవైపు అక్రమ అరెస్టులు మరోవైపా ప్రశ్నిస్తే కేసులా.6 గ్యారెంటీలపై కేటీఆర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆమోదించి ప్రజా పాలన కొనసాగించాలి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఉదయం నాలుగు గంటలకే బిఆర్ఎస్ నాయకుల అసెంబ్లీ ముట్టడిలో భాగంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ఇంత భయం ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళకు కనీస గౌరవం లేకుండా పోతుందని తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న హామీలు గౌరవ వేతనం ఇట్టి స్థలం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రెండున్నర సంవత్సరాలు అవుతున్న కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బిఆర్ఎస్ నాయకులను తెలంగాణ ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు తెలిపారు అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ సర్కార్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు ఏ వర్గానికి కూడా సరైన న్యాయం చేస్తా లేదని కేటీఆర్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఆమోదించి ఆరు గ్యారెంటీ లపై ప్రజా పాలన చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు….
