
జనం న్యూస్ మార్చ్ 24, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం
పూడూరు మండలం దామగుండంలో త్వరితగతంగా కొనసాగుతున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ తో కలిసి పరిశీలించారు.దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ని, ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్, సన్మానించి మొమెంటో అందజేశారు.ఈ ప్రాజెక్టు ప్రాంత అభివృద్ధికి,దేశ భద్రతా పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
