
జుక్కల్ మార్చి 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం రోజు భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించిన మహా పాదయాత్ర భక్తుల హృదయాలను ఆకట్టుకుంది. కేమ్ రాజ్ కళ్లాలి గ్రామం నుంచి మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ హనుమాన్ దేవాలయం వరకు సాగిన ఈ పాదయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు పాదయాత్ర అనంతరం మిర్జాపూర్ హనుమాన్ దేవాలయంలో ఏలే మల్లికార్జున్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.శాలువాతో ఘన సత్కారం – గురుస్వాముల చేతుల మీదుగా గౌరవం ఈ కార్యక్రమం అనంతరం గురుస్వాముల చేతుల మీదుగా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షునితో పాటు సాయి పటేల్ కల్లాలి రమేష్ దేశాయ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ హనుమాన్లు స్వామి మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మద్నూర్ సర్పంచ్ భర్త మరియు హనుమాన్ స్వాములు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

