
అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్.
నాకు అండగా నిలుస్తున్న మోత్కూర్ ప్రజలకు, యువతకు విద్య వంతులకు ధన్యవాదములు.
జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో నివసిస్తున్న "అడ్వకేట్ కొత్తపేట ఇంద్రసేన్" అలియాస్ "కొత్తపేట శివకుమార్" యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందించి తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం రాత్రి తన పుట్టినరోజును గ్రామ సర్పంచ్ కొత్తపేట ఆనంద్, గ్రామ యువకులు డైరెక్టర్ల గిర్ని మల్లేశం ఆధ్వర్యంలో,కేకు కట్ చేసిన తర్వాత నిరుపేద కుటుంబం అయిన తిరుమలి చంద్రమ్మ కుమారునికి 5100/- స్వయంగా అందించాడు. పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడానికి ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి. అందులో నా వంతుగా 5100/- రూపాయలు ఒక నిరుపేద కుటుంబానికి అందిస్తే, వారి
కనీస అవసరాలు తీరుతాయని అభిప్రాయంతో, నేను అందించానని ఇంద్రసేన్ తెలిపారు. నా వంతుగా విద్యాపరంగా గతంలో ఆర్థిక సహాయం చేశాను. ప్రస్తుతం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాను. భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలపై నా వంతుగా ఆర్థిక సహకారం అందిస్తానని, తన పుట్టినరోజు సందర్భంగా తెలపడం జరిగింది.