
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా
రాష్ట్ర సచివాల యం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ ,నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ కలిశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగులకు ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల సీఎం కి ధన్యవాదాలు తెలియ జేశారు.ప్రభుత్వం,విద్యార్థులకు,యువతకు చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకొని వెళుతున్నామని వేణు గోపాల్, సిద్ధిక్ చెప్పడంతో ముఖ్యమంత్రి ఆయనని అభినందించారు. కూటమి ప్రభుత్వ చేస్తున్న కార్య క్రమాలను యువత విద్యార్థు ల్లోకి తీసుకెళ్లాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు