
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా
నందలూరు మండలం ఎర్రి పాపాయిపల్లి, పాటూరు గ్రామం నందు ఉన్నటువంటి విభా ఎరుడైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఆర్కే అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ , ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ మరియు ఆర్కే అబాకస్ ఒలంపియాడ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సంస్థ వారు స్టేట్ లెవెల్ పరంగా నిర్వహించిన పరీక్షలో 800 మంది పాల్గొన్న ఈ పరీక్షలో ఐదవ తరగతి చదువుతున్నటువంటి వెలగపండు ప్రణయ్ పుష్కర్ రెండవ స్థానం పొందడం జరిగింది. అలాగే ఐదు మంది బాలురకు జిల్లా స్థాయిలో మొదటి, రెండవ, మూడవ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఆర్కె అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ ఒలంపియాడ్ ఎడ్యుటెక్ సొల్యూషన్స్ సంస్థ కోఆర్డి నేటర్ అయినటువంటి సిద్ధార్థ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ నందు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అలాగే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నందు విభా ఎరుడైట్ స్కూల్లో ఒకటో తరగతి నుండి 5వ తరగతి చదువుతున్నటు వంటి పిల్లలకు మొదటి, రెండవ, మూడవ బహు మతులు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ స్టేట్ లెవెల్ లో నిర్వహించినటు వంటి ఈ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ పరీక్షలో కేవలం ఎనిమిది నిమిషాల్లోనే పరీక్షని ముగించి రెండో బహుమతి గెలు పొందడం ప్రశంసనీయం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ డాక్టర్ బి జయ భాస్కర రావు , ప్రిన్సిపల్ హరిబాబు , కోఆర్డినేటర్ టి. అమర్నాథ్ స్కూల్ ఇన్చార్జ్ సుజాత మరియు కంప్యూ టర్ సైన్స్ టీచర్ అభిషేక్ ఇంగ్లీష్ టీచర్ లలిత్, లక్ష్మీ హిందీ టీచర్ షహనాజ్, మాథ్స్ టీచర్ శివయ్య, మాధవి మొదలగు ఉపాధ్యా యులు పాల్గొనడం జరిగింది
