
జనంన్యూస్. 26.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
శ్రీరామ నవమి మరియు హనుమాన్ జయంతి ర్యాలీల సందర్భంగా ఆర్గనైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్.డి.జె వాడకం పూర్తిగా నిషేధం.నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ నవమి మరియు హనుమాన్ జయంతి కార్యక్రమంలో నిర్వహణ సందర్భముగా పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాలులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.,శ్రీరామ నవమి మరియు హనుమాన్ జయంతి శోభాయాత్ర ర్యాలీ నిర్వహకులతో వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ర్యాలీలో పాటించవలసిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహం జరుపుకోవాలని ర్యాలీ పూర్తిగా ఆధ్యాత్మికముగా నిర్వహించుకోవాలని అదే సమయంలో ఇతరులకు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరామ నవమి మరియు హనుమాన్ జయంతి శోభాయాత్రను గత సంవత్సర క్రితం జరిగిన మాదిరిగానే అనుమతి గలదు అదే రూట్ లో నిర్వహించాలి కొత్త రూట్ లకు అనుమతి ఎలాంటిది లేదు పాత రూటు ప్రకారమే అనుమతి గలదు నిర్వాహకులు తప్పనిసరి వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి వారికి ముందుగానే ర్యాలీకి సంబంధించినటువంటి సూచనలు తెలియజేయాలి అన్నారు. డిజె సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధమని తెలియజేశారు. డ్రోన్లు వాడకం నిషేధమని తెలిపారు.ఈ సమావేశంలో ర్యాలీ ఆర్గనైజర్లు వారి సందేహాలు సలహాలు పోలీస్ కమిషనర్ స్వీకరించారు.సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి , నిజామాబాద్ టౌన్ ఏసిపి ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , సిఐలు , ఎస్సైలు మరియు విశ్వహిందూ పరిషత్ , బజరంగ్దళ్ , ఆర్య సమాజ్ , హిందు వాహిని , ఏబీవీపీ తదితరులు పాల్గొనడం జరిగింది.
