
కాడ్లాపూర్ - రాపోల్ రైతులు ఆందోళన
జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కాడ్లాపూర్ - రాపోల్ రైతుల ఆందోళన తమ భూములు పరిశ్రమల పేరుతో లాక్కోవద్దంటూ నిరసన ధర్నా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు తీసుకోవద్దని పరిగి బస్టాండ్ నందు బేటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రాణం పోయినా సరే భూములను వదులుకోలేమన్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాలను రైతులు అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.