
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026
తీసుకున్నారు సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఈ సందర్భంగా జహీరాబాద్ రైతు సంఘం మండల అధ్యక్షునిగా ఆనేగుంట నాగిశెట్టిని నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అలాగే గ్రామ స్థాయిలో రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని బాలరాజ్ సూచించారు రైతుల హక్కుల పరిరక్షణలో ముందుండి పోరాటం చేయాలని కొత్తగా నియమితులైన మండల అధ్యక్షుడు నాగిశెట్టికి బాధ్యతలు అప్పగించారు ఈ నియామకంతో రైతు సంఘం కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగిశెట్టి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు అలాగే మండలంలోని ప్రతి రైతును సంఘంలో భాగస్వామ్యులను చేసి వారి హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు
