
జనం న్యూస్ 26 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర రావాణ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలొ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొని గద్వాల నియోజకవర్గంలోని ఆర్ ఆర్ టి సి రవాణా వ్యవస్థకు సంబందించిన వినతిపత్రం అందజేసి సమస్యలను మంత్రికి వివరించడం జరిగింది దీనికి గాను మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు గద్వాల ఎమ్మెల్యే మంత్రివర్యులకు సమస్యలు వివరిస్తూ గద్వాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్ టి సి బస్సు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చాలని, ప్రతి గ్రామానికి బస్టాండ్ లను నిర్మించి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పార్చాలని, రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఎలక్ట్రికల్ బస్సులను అధిక మొత్తంలో కేటాయించాలని, గద్వాలలొ నూతన ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ నిర్మించాలని, గద్వాల బస్టాండ్ లొ అన్ని మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకీ తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలొ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి సీతక్క మంత్రి వివేక్ వెంకటస్వామి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్టిసి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా ఐఏఎస్ వికాస్ రాజు మరియు ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.