
జనం న్యూస్ మార్చి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ శాఖ పాడి పరిశ్రమలను అభివృద్ధి కి ఇంతగానో కృషి చేస్తుందని పశువులను వివిధ రకాల వ్యాధులనుండి కాపాడుకోవాలని అన్నారు మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్ మాట్లాడుతూ గాలి కుంటు టీకాలు వివిధ రకాల వ్యాధులపై అవగాహన రైతులకు కల్పించారు పశువులకు ఎలాంటి వ్యాధి వచ్చిన వెంటనే మాకు తెలియపరిచాలని తెలిపారు గ్రామాలలో చికిత్స శిబిరం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు మండలంలోని ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయని రైతులు పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ సర్పంచ్ దివ్య తిరుపతి ఎం రవీందర్ కుమార్ రమేష్ రవి సదానందం రమాదేవి రైతులు పాల్గొన్నారు..