
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550979955
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ ఎస్పీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.లోక కల్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత క్రమశిక్షణతో మరియు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.శ్రీ రామనవమి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రధాన రామాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.శోభ యాత్ర, కల్యాణ వేడుకలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పండుగను మత సామరస్యంతో, సోదరభావంతో జరుపుకుని జిల్లా ప్రశాంతతకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ధర్మ స్థాపన కోసం రాముడు చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని,
శ్రీ రామనవమి పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు.