
కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక యువకులు
జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఆరవ వార్డు (టి సి) గృహాల పరిధిలో ని భారీ సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు అని స్థానిక కౌన్సిలర్ మరియు నందికొండ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్ పర్సన్ ల దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక యువకులు అందుగుల రాజీవ్ ,మంద కిషోర్. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ చందూలాల్, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, చైర్ పర్సన్ మానస సుమన్ లతో కలిసి సెప్టిక్ ట్యాంక్ ను సందర్శించి , సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే దుర్వాసనతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని, వాసనకు కాలనీలో ఉండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ ఆఫీసర్ బాలాజీ నాయక్, కాలనీవాసులు పల్లవుల శీను, థామస్ తదితరులు పాల్గొన్నారు.