
జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుస్మిత (రోల్ నెంబర్ 1016898) 2025 డిసెంబర్ 13వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్ లో ఇచ్చట ఉచిత విద్యనందిస్తుంది . గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ లో ప్రఖ్యాత లీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి విద్యాప్రణాళిక ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడించి, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీల సహాయంతో ఇక్కడ అత్యుత్తమ డిజిటల్ విద్యాబోధన అందించబడుతుంది అని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన సుస్మితను పాఠశాల ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మ లు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గెల్లా భూలక్ష్మి దేవి,కుంచే దుర్గ, దుగ్గుదుర్తి వీరలక్ష్మి,ఓలేటి రాణి, పోతుల లతా మంగేష్కర్, గంజాల వరలక్ష్మి, నల్లా దేవకి, మద్దింశెట్టి మాలతి తదితరులు పాల్గొన్నారు.
