
జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన నిర్వహించిన పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ రెండవ రోజు కార్యక్రమం ఘనంగా ముగిసింది ఈ శిక్షణ కార్యక్రమం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్వహించబడుతూ,కార్యకర్తలలో సిద్ధాంత అవగాహన, నాయకత్వ లక్షణాలు, మరియు సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.రెండవ రోజు కార్యక్రమం యోగా కార్యక్రమంతో ప్రారంభమై,
తదుపరి సెషన్లలో మండల నుండి బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం,బూత్ మేనేజ్మెంట్, ప్రజలతో కమ్యూనికేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన,సోషల్ మీడియా వినియోగం వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు చురుకుగా పాల్గొని, తమ అభిప్రాయాలు మరియు అనుభవాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య వక్తలు మాట్లాడుతూ:“భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం.సిద్ధాంతబద్ధంగా, క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది.ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుండి పార్టీని ప్రజలతో అనుసంధానం చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ మెంబర్ మానేపల్లి అయ్యాజీ వేమ, కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్తా (నానాజీ), వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగిరెడ్డి సతీష్ రావు, జిల్లా కార్యదర్శి దంతులూరి రమా వర్మ , గుంటూరు జిల్లా ఇంచార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి, రొక్కాల సత్తిబాబు, నిట్టల వెంకటలక్ష్మి, దంగుడుబియ్యం శ్రీనివాసరావు, అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, దంతులూరి సాయిరాజు,తటవర్తి నాగరాజురావు, కిసాన్ మోర్చా కార్యదర్శి కోనే రామ్మూర్తి , జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి కృష్ణమూర్తి, ముమ్మిడివరం టౌన్ కమిటీ సభ్యులు,
మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
