
జనం న్యూస్, మార్చ్ 27, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
పట్టణంలో ఈరోజు కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది ముందుగా ఖాదీ బండారి హనుమాన్ ఆలయం నుండి స్వామివారిని ఎదుర్కోలుగా తీసుకొని వచ్చి కోదండ రామాలయం లో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి ఈ కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు, మరియు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పలు వార్డ్ కౌన్సిలర్లు, హనుమాన్ దీక్ష భక్తులు, అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు