లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి…
జనం న్యూస్, జనవరి 13, బోధన్ నియోజవర్గం : సంత్ సేవలల్ మహారాజ్ జయంతిని సంపూర్ణంగా సెలవు ప్రకటించాలి మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణలో 50 లక్షలకు పై చిలుక ఉన్న లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని గిరిజన విద్యార్థి సంఘం బోధన్ మండల అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరారు . అలాగే లంబడాల ఆరాధ్య శ్రీ సంత్ సేవలల్ మహారాజ్ బంజారాల అభివృద్ధి కోసం సంస్కృతి సంప్రదాయాల కోసం అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి అలాంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు . లంబాడాలు మాట్లాడే బోరుబోలి భాషను భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి అలాగే సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తండాలను ఏర్పాటు చేశారు అట్టి ప్రత్యేక గ్రామపంచాయతిల అభివృద్ధి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలి తెలిపారు.