
జనం న్యూస్ ;27 మార్చ్ శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో సీతారాముల చిత్రాన్ని చిత్రించిన అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ఆవిష్కరించారు. పురుషోత్తముడు రాముడుసీత జీవితం ఎందరికో మార్గదర్శం కావాలని యువజంటలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆశాభావం వ్యక్తం చేశారు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం తదితరులు పాల్గొన్నారు.