
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు, దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లావుడియా రామా రవి, ఉప సర్పంచ్ సునీత భాస్కర్ హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించగా గ్రామ పెద్దలు మాలోత్ భాషా, అజ్మీర్ లక్ష్మణ్, మాలోతు తిరుపతి, వినోద్ ,రాజు, వసురం, సునీల్,మొగిలి, కృష్ణ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..