
రాములోరిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్, మార్చి 27,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. మండలం లోని రామన్నపాలెం, మోసయ్యపేట గ్రామాల లోగల రామాలయంలో శ్రీరాములోరిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేతో శ్రీరామ నవమి స్వామి విశేష పూజలు చేయించారు.అనంతరం ఆలయ పెద్దలు ఎమ్మెల్యేని సత్కరించి,తీర్ధ ప్రసాదాలు అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ….తెలుగు ప్రజల సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి.పండుగ ప్రతి తెలుగు వారి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ శ్రీరామ నవమి పర్వదినం నియోజకవర్గ,రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
