
జనం న్యూస్ మార్చి 27 మహాముత్తార మండలం
నల్లగుంట మినాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆదర్శమైన దివ్య వివాహ మహోత్సవము. క్షేత్ర శుద్ధ నవమి రోజున జరిగే ఈ వేడుక లక్ష్మీ నారాయణ కలయికగా భావిస్తారు, ఇది భార్యాభర్తల అనుబంధానికి ధర్మానికి, ప్రేమకు మరియు నిబంధనకు ప్రత్యేకగా నిలుస్తుంది. ఆణిముత్యాల వంటి తలంబ్రాలతో జరిగే ఈ వివాహం మీనాజీ పేట గ్రామం భక్తులకు ఆనందం,అన్యోన్యత మరియు సంతోషం కలుగుతాయని ప్రజల నమ్మకం. ఆలయ పూజారి నరహరి శర్మ మాట్లాడుతూ సీతాదేవి భూమాత స్వరూపంగా, రాముడు సూర్యవంశయుడని వీరి వివాహం వలన భూమి సఫలవంతమై సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామ రసాన్ని ఆస్వాదిస్తూ, సీతారామ నామస్మరణతో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు మోతుకూరి రవి కంకణాల చంద్రమౌళి సతీష్ తిరుపతి రవీందర్ శ్రీనివాస్ రెడ్డి రమేష్ రాజేందర్ శ్రీకాంత్ క్రాంతి శ్యామ్ రాజగోపాల్ చందు రామ్ లక్ష్మణ్ పవన్ రజినీకాంత్ నాగరాజ్ బాల్ రెడ్డి శేఖర్ రాజయ్య ఐలయ్య రాజు దేవేందర్ బన్నీ నిఖిల్ కుమార్ అభి ఓదేలు మరియు హనుమాన్ స్వాములు కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి పెద్దలు, పాల్గొన్నారు, సాయంకాలం శ్రీ సీతారామచంద్ర గ్రామ పురవీధులలో పల్లకి సేవలో ఊరేగించడం జరుగుతుంది.