
జనం న్యూస్ మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి
ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామాలలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యులు గోటితో వలసిన తలంబ్రాలు బియ్యాన్ని కాట్రేనికోన వాస్తవ్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణగుప్త ( నానాజీ) ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గొలకోటి సాయిబాబు గాలిదేవర బుల్లి గాలిదేవర రమేష్ మట్ట సూరిబాబు నంద్యాల నరసింహస్వామి ముమ్మిడి వరపు ఏడుకొండలు ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గొల్ల కోటి గాంధీ, గ్రామస్తులు సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో మాతృమూర్తులు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

