జనం న్యూస్ ఫిబ్రవరి 13 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం (రిపోర్టర్ నఖీమ్) రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం ను అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ పరిశీలకులు పుచ్చ విజయకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో,నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, పుచ్చ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ, ఉభయ గోదావరి పట్టభద్రుల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని అభ్యర్థిగా నియమించారని, 34 నియోజకవర్గాల్లో 3లక్షల 16 వేల ఓట్లు,440 బూతులు ఉన్నాయి. ముఖ్యంగా వేలేరుపాడు మండలంలో 1 బూతు 198 ఓట్లు ఉన్నాయనీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం ని ప్రతిపాదించడం జరిగిందని, రాజశేఖరం ఒక సామాన్య కార్యకర్త ఆయన పనితీరుని బట్టి చంద్రబాబు ఒక సముచిత స్థానం కల్పించాలని ఆలోచనతో విద్యావంతుడు కావడంతో ఎమ్మెల్సీగా ఆయన్ని నియమించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పార్టీల సింబల్స్ ఉండవు పేరాబత్తుల రాజశేఖరం ఆయన ఫోటో సీరియల్ నెంబర్ 1, అని మాత్రమే ఉంటుందని, ఎన్నికలు డిగ్రీ పూర్తి చేసుకొని ఓటు హక్కు కలిగిన వారు మరియు ఉపాధ్యాయులు ఓటు వేసే అవకాశం ఉంటుందని వారన్నారు. అయితే ఉపాధ్యాయులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతగా హింసించాడనేది వారికి తెలుసని ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్య వ్యవస్థను బలోపితం చేస్తూ ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పించి రాబోయే రోజుల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వారు అన్నారు. ఈ సమావేశంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు అమరవరపు అశోక్, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఓలేటి అనిల్, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.