
జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మెగా అభిమానులు సందీప్ దానపాల్, అరవింద్, చెర్రీ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బాలానగర్ లోని మైత్రీ విమల్ థియేటర్ లో జరిగిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ 41 వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ఒక రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది.తలసేమియా, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం అని , రక్తదానం చేస్తున యువతను,నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భోగాది వెంకటేశ్వర రావు, కొల్లా శంకర్, గడ్డం కిషోర్ నాగరాజు, పులగం సుబ్బు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.