
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 28-03-26
ఒంటిమిట్ట కోదండ రామ స్వామి మరియు నందలూరు సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం విచ్చేసిన రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశే ఖర్ గుప్తాను నందలూరు రైల్వే స్టేషన్లో రైల్వే కన్సల్టే టివ్ మెంబర్ రాచూరి మురళి మర్యాద పూర్వ కంగాకలిశారు.ఈసందర్భంగా,నాగిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ఎదుర్కొం టున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రం సమర్పిం చారు.వినతి పత్రంలోని ప్రధాన అంశాలు:-నీటి లీకేజీ సమస్య: నూతనంగా నిర్మించిన ఆర్.యు.బి బ్రిడ్జి నుండి నీరు లీక్ అవుతుండ టం వల్ల ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారని వివరిం చారు.రోడ్డు పరిస్థితి: బ్రిడ్జి కింద రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల వాహన దారులు ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.ప్రజల భద్రత: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పైన షెల్టర్ నిర్మించాలని మరియు అసాంఘిక కార్యకలాపాలు జరగ కుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.డిఆర్ఎం సానుకూల స్పందన:రాచూరి మురళి విన్నవించిన సమస్యలపై డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలు ఇప్పటికే తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే వీటన్నింటినీ పరిశీలించి తగిన మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.