
జనం న్యూస్ మార్చి 28, వికారాబాద్ జిల్లా పరిగి నియోజ కవర్గంలో
బీఆరెస్ పార్టీ సర్పంచులు వివక్షకు గురి అవుతున్నారు అని నేడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసిన బీఆరెస్ పార్టీ సర్పంచులు.స్థానిక పరిగి ఎమ్మెల్యే , బీఆరెస్ పార్టీ మద్దతుతో గెలిచిన గ్రామాలకు ఎన్ ఆర్ జిఎస్ (కేంద్ర ప్రభుత్వం) నుంచి వచ్చే నిధులను ఇవ్వడం లేదు అని, అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు. మా గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను యధావిధిగా మాకు ఇవ్వాలని బి.ఆర్.ఎస్ పార్టీ సర్పంచులు కోరారు స్థానిక పరిగి ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సర్పంచుల మీద వివక్షత చూపిస్తున్నారు అని బి ఆర్ ఎస్ సర్పంచులు , కలెక్టర్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.