
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ మార్చ్ 28 శనివారం
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం 3వ వార్డులో ఈశమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి చైర్మన్ భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ విష్ణు, కౌన్సిలర్ హరి శంకర్ నాయుడు, కాంగ్రెస్ నాయకులు షకీల్, వెంకటరమణ, సత్యనారాయణ, మోతే రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు