
జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పరమ పూజ్య శివ స్వామి వారు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో ఆచార్య నాగార్జున పేరిట మెషిన్ రూమ్ ప్రారంభం
ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నేడు పిల్-12మరియు సెట్-27 కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు పవర్ టాక్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా పరమ పూజ్య శివ స్వామి వారు మరియు అతిథిగా శ్రీ తడవర్తి రాంబాబు పాల్గొని కార్యక్రమాన్ని విశేషంగా అలరించారు.పూర్ణ కుంభంతో స్వాగతం:
ఉదయం సుమారు 9:00 గంటలకు పరమ పూజ్య శివ స్వామి వారు కళాశాల ఆవరణకు విచ్చేసిన వేళ వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామీజీ విచ్చేసిన సందర్భంగా కళాశాల ఆవరణ భక్తిభావంతో నిండిపోయింది.ఆచార్య నాగార్జున పేరిట మెషిన్ రూమ్ ప్రారంభం:
ఉదయం 9:35 గంటలకు పరమ పూజ్య శివ స్వామి వారి పవిత్ర హస్తాల చేత రెండవ శతాబ్ద వ్యక్తి అయినటువంటి శ్రీ ఆచార్య నాగార్జున పేరిట కళాశాలలో మెషిన్ రూమ్ ప్రారంభించబడింది. ఫార్మసీ శాస్త్రానికి ఆద్యుడైన ఆచార్య నాగార్జున పేరిట ఈ మెషిన్ రూమ్‌ను అంకితం చేయడం విద్యార్థులకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు పేర్కొన్నారు.సెమినార్ హాల్లో విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక బృందం అందరూ సమావేశమయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం త్రినాధ రావు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. అనంతరం గణపతి అథర్వశీర్షం పఠించి విఘ్నాలను దూరం చేసుకున్నారు.స్వాగత ప్రసంగంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. త్రినాధ రావు మాట్లాడుతూ — ఐ ఎల్ ఎల్ ప్రోగ్రామ్ జనవరి 9, 2025న ప్రారంభమైందని, విద్యార్థులలో సృజనాత్మకత, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు. ఎస్సీ ఈ టీ ప్రోగ్రామ్ విద్యార్థులలో నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందని తెలిపారు.అతిథి ప్రసంగం:అతిథి తడవర్తి రాంబాబు మాట్లాడుతూ — ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులకు పి ఐ ఎల్ ఎల్, ఎస్ ఈ టి వంటి నూతన కార్యక్రమాల ద్వారా అందిస్తున్న శిక్షణ అభినందనీయమని పేర్కొన్నారు. ఫార్మసీ రంగంలో నైతికత మరియు వృత్తి నైపుణ్యాలు రెండూ సమానంగా అవసరమని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. విద్యార్థులు కేవలం డిగ్రీకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ముఖ్య అతిథి పరమ పూజ్య శివ స్వామి వారు తమ దివ్య ప్రసంగంలో — విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత మరియు ఆధ్యాత్మిక చైతన్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. భారతదేశం యొక్క గొప్ప సంప్రదాయం మరియు ధర్మం గురించి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారు నైతికంగా, వృత్తిపరంగా శ్రేష్ఠంగా ఎదగాలని ఆశీర్వదించారు. స్వామీజీ ప్రసంగం సభలో అందరినీ ఆధ్యాత్మిక చైతన్యంతో నింపింది.పవర్ టాక్ ఫార్మసీ రంగంలో అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలు, పరిశోధన రంగంలో ముందుకు సాగే విధానాలు మరియు వ్యవస్థాపకత గురించి విద్యార్థులకు విలువైన మార్గదర్శనం అందించబడింది. విద్యార్థులు అత్యంత ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగారు.ప్రముఖుల ప్రసంగాలు:కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీను , డైరెక్టర్ ఏ సంతోష్ శివకుమార్ , ట్రెజరర్ ఏ.జేయ.ల్. ప్రవల్లిక, డైరెక్టర్ ఇయర్ కె నరసింహ రావు (సంతోష్) , జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె. హారిక, సెక్రటరీ డాక్టర్ పి. నాగమణి మరియు చైర్మన్ ఎల్ .ఎన్.పి.కనకరాజు వరుసగా మాట్లాడారు. అందరూ కళాశాల నిర్వహణ మరియు పి ఐ ఎల్ ఎల్, ఎస్ ఈ టి కార్యక్రమాల లక్ష్యాలను ప్రశంసించారు.కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిథి పరమ పూజ్య శివ స్వామి వారికి మరియు అతిథి తడవర్తి రాంబాబు కి చైర్మన్, డైరెక్టర్లు మరియు ప్రిన్సిపాల్ కలిసి స్మృతి చిహ్నాలు అందజేసి సత్కరించారు.ముగింపులో కోఆర్డినేటర్ శ్రీనివాస్ ధన్యవాద ప్రసంగం చేస్తూ — విచ్చేసిన గౌరవ అతిథులకు, సంస్థ నిర్వహణ వర్గానికి, అధ్యాపకులకు, సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం జై హింద్, వందే మాతరం నినాదాలతో విజయవంతంగా ముగిసింది.
