
డోంగ్లి మార్చి 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డొంగ్లి మండలం మదన్ హిప్పర్గా గ్రామం లో సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ గారు ఉచిత గాలికుంటూ నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి Dr M. వినీత్ కుమార్ మాట్లాడుతూ పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు వేయాలని పాడి రైతులకు సూచించించారు. అయితే ఈ రోజు 150 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ ఉపసర్పంచ్ గైక్వాడ్ సరుబాయి తో గౌరవ్ సభ్యులు డి మల్లికార్జున్, మల్లేష్ రావు మరియు రైతులు పాల్గొన్నారు .అలాగే ఈ కార్యక్రమంలోకార్యదర్శి పవన్ సర్ , వెటర్నరీ అసిస్టెంట్ మున్నవర్ అలీ గోపాల్ మిత్రులు గాయక్వాడ్ సయ్యాజీ గారు చంద్రశేఖర్, తో రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ టీకా కార్యక్రమంలో అందరూ పాల్గొని సహకరించి విజయం చేసినందుకు , సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
