
22లక్షల70వేలకు దక్కించుకున్న షేక్ కాజా మియా…
బిచ్కుంద మార్చ్ 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజు 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కార్ ఆధ్వర్యంలో,మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్ పర్యవేక్షణలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలంపాటలో ఐదుగురు వ్యక్తులు పోటీపడ్డారు.ఈ వేలం పాటలో ఇద్దరు వ్యక్తులు నువ్వా నేనా అన్నట్టు సాగిన చివరికి షేక్ కాజా మియా 22 లక్షల 70 వేలకు దక్కించుకున్నారు. షేక్ ఖాజా మియా ను మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ శాలువాతో సత్కరించారు వేలం పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కౌన్సిలర్ నౌషా నాయక్, కార్తిక సంతోష్ దర్పల్, మారుతి వ్యాపారులు,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
