
జనం న్యూస్ మార్చ్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం తన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగువాడి ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోకి అడుగు పడుతున్న వేళ నాలుగున్నర శతాబ్దాలుగా అధికార ప్రతిపక్ష బాధ్యత వహించి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని క్రిమినల్స్ ని, తుగ్లక్ పాలనలో జగన్ రెడ్డి నిర్ణయాలు వ్యతిరేకిస్తూ 2019 నుంచి 2024 వరకు జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు చేయని ప్రయత్నం లేదని, చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టినప్పటికీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల కార్యకర్తలు నాయకులు నిబద్ధతతో చెక్కుచెదరకుండా పార్టీకి మద్దతు తెలియజేసి ఒక్క కార్యకర్త కూడా చెక్కుచెదరలేదని ఎన్టీఆర్ పట్ల, చంద్రబాబు నాయకత్వం పట్ల తమ విధేయతను తెలియజేసిన తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త జీవితాంతం పార్టీకి విధేయులుగా ఉంటారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకటరావు కోట్ని రామకృష్ణ కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల రవీంద్ర ఎన్టీఆర్ కి నివాళులర్పించారు.