
జనం న్యూస్ 29 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తేది 28.03.2026 నాడు ఉదయం గంటల 5:30 సమయంలో మన్నేగూడ చౌరస్తా వద్ద Chengomul యస్.ఐ మరియు వారి సిబ్బంది వాహనాలు తనికి చేయుచుండగా ఒక డీజిల్ ట్యాంకర్ రాగా అట్టి డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ నీ విచారించగా తెలిసినది ఏమనగా, G.రాజు అనే వ్యక్తి తక్కువ ధరకు కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ కొనుగోలు చేసి డీజిల్ ట్యాంకర్ నెంబరు AP15TC7692 లో డ్రైవర్ హరిజన అనిల్ తండ్రి రమేష్ , వయస్సు 26 సంవత్సరలు నీవాసము ఇష్ణాపూర్ తో కలిసి తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా తరలించి అధిక ధరకు అమ్ముకొని సులువుగా ఎక్కువ మొత్తములో డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ప్రభుత్వ సంపాదనకు గండి కోడుతు అనైతిక చర్యకు పాల్పడుతున్నారని శ్రీ గణపతి రావు డి.టి సివిల్ సప్లై వికారాబాద్ జిల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించనైనది అని Chengomul SI భరత్ రెడ్డి తెలిపారు.