
జనం న్యూస్ మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా నిన్న బోరబండ శివయ్య బస్తీలో పర్యటించిన ఆయనకు స్థానికులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, అక్కడ చెత్త వేయడం పైన ప్రజలు రమేష్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన అప్పుడే రైల్వే ఉన్నతాధికారులకు, మున్సిపల్ అధికారులకు ఆయా సమస్యలను పరిష్కరించాలని ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ని వ్యక్తిగతంగా కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. బోరబండ రైల్వే స్టేషన్ పరిధిలోని ఖాళీగా ఉన్న స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి రక్షణ కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని దీంతోపాటు వీధిదీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడినుండి చెత్త డంపింగ్ ను తరలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే జిఎం శ్రీ వాస్తవ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ మాట్లాడి తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులని ఆదేశించారని బండి రమేష్ పేర్కొన్నారు. అలాగే ఆర్టిసి అధికారులతో మాట్లాడి. గతంలో బోరబండ రైల్వే స్టేషన్ కు ఆర్టిసి బస్సులు నడిచేవని వీటిని నిలిపియడంతో ప్రస్తుతం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మళ్ళీ బస్సులను స్టేషన్ వరకు నడపాలని ఆర్టీసీ వారిని విజ్ఞప్తి చేశారు…
