
జనం న్యూస్ 30 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ధరూర్: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో పల్లె / బస్తీ నిద్ర కార్యక్రమంలో ర్యాలీతో,మరియు సభలో స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వేరోస్ ఏం చేస్తారు స్వేరోస్ గా ఉంటే ఏం చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.బుద్ధుడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి ,ఛత్రపతి శివాజీ మహారాజ్ ,కాన్సిరాము ఆలోచనలు మరియు ఆలోచన విధానాలను కొనసాగించేదే స్వేరోలు అని చెప్పడం జరిగింది. స్వేరోలు ఎవరు కూడా, మేము ఎక్కడ కూడా తక్కువ కాదు, మేము ఇతరుల కంటే భిన్నంగా ఆలోచన చేస్తామని మా లక్ష్యం. ఉన్నతంగా మేము ఎప్పటికీ కూడా వెనక తగ్గమని కమిట్మెంట్తో ఉండే స్వేరోలు అని తెలియజేయడం జరిగింది..స్వేరోలు ఎందరీనో విద్యావంతులుగా తయారూ చేసి స్వేరోలు ఏప్పుడు కూడా ఆరోగ్యం పై దృష్టి పెట్టి ,ప్రేరణ కార్యక్రమం ప్రతి శనివారం చేయాలి. గతంలో ఏం చేశామని ప్రేరణ కార్యక్రమంలో తెలియజేసుకోవాలని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా రాజ్యాన్ని సాధించేది స్వేరోలకు సాధ్యమని చెప్పడం జరిగింది. స్వేరోస్ ఎప్పుడూ కూడా విద్యకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది.
ఈ పల్లె బస్తి కార్యక్రమానికి మార్లబీడు గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు జోగులాంబ గద్వాల జిల్లా స్వేరోస్ కమిటీ సభ్యులకు మరియు అదేవిధంగా మార్లబీడు గ్రామ ప్రజలకు ఇతరులకు కూడా ప్రత్యేకంగా జై భీములు తెలపడం జరిగింది. స్వేరో ఐడియాలజీ భవిష్యత్ కాలంలో కచ్చితంగా విజయం సాధించి స్వేరోలుగా కచ్చితంగా విజయం సాధించాలని చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్వేరోస్ కమిటీ సభ్యులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా స్వేరోస్ కమిటీ సభ్యులు మరియు మార్లబీడు గ్రామ ప్రజలు అదేవిధంగా ఇతర సీనియర్స్ స్వేరోస్ మరియు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.