
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మార్చ్ 30 సోమవారం
సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయని, పౌర హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ నగర్ కర్రెమ్మ గుడి అంబేద్కర్ భవనంలో నిర్వహించిన 'పౌర హక్కుల దినోత్సవం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.