
జనం న్యూస్ మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
గత ఏడాది ఉగాది కానుకగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్బంగా అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ కాలనీలోని వి.శ్రీనివాస్ అనే వికలాంగుని కుటుంబం వారి ఇంటికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, సన్న బియ్యంతో భోజనం వండి వడ్డించడం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సన్న బియ్యం బువ్వతో సి.ఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. గత ఏడాది నుండి రేషన్ దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యం పంపిణి రేషన్ దుకాణాల ద్వారా నిరంతరాయంగా జరుగుతోందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇంటికి పిలిచి సన్నబియ్యంతో అన్నం వండి అందించిన శ్రీనివాస్ మాధవి దంపతులను వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, సి హెచ్.భాస్కర్, పోశెట్టిగౌడ్, ఖాజా, రవీందర్, వివేక్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
