
జనం న్యూస్ : 30 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై.రమేష్;
ఉత్సాహ రామాయణం, శ్రీ వశిష్ట గీతామృతం రామాయణం ను ప్రతి ఒక్కరూ చదవడమే కాకుండా అందులోని ఆచరణీయ అంశాలను నిత్యజీవితంలో అన్వయించుకోవడం ఎంతో ముఖ్యమైన ముఖ్య అతిథి రఘువీర్ ప్రతాప్ అన్నారు, అదేవిధంగా మరో పుస్తకము "శ్రీ వశిష్ట గీతామృతము" సరళమైన భాషలో వ్రాయడమే కాకుండా అందంగా అచ్చు వేశారని విశిష్ట అతిథి డాక్టర్ దాశరధుల బాలయ్య కొనియాడారు. ఈ సందర్భంగా "ఉత్సాహ రామాయణం" రచయిత శ్రీ పెందోట వెంకటేశ్వర్లు, "శ్రీ వశిష్ట గీతామృతం" రచయిత అన్నల్ దాస్ రామకిషన్ గార్ల ఈ రెండు ఆధ్యాత్మిక పుస్తకావిష్కరణల మహోత్సవం స్థానిక సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. శ్రీ వాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- సిద్దిపేట కళలకు, సాహిత్యానికి మంచి పుట్టినిల్లు అని, అనేక మంది కవులు తమ రచనలను ప్రజాహిత దృక్పథంతో రచనలు చేయుచున్నారన్నారు. అన్నల్ దాస్ రామకిషన్ మాట్లాడుతూ "శ్రీ వశిష్ట గీతామృతం" లో సత్యం, ధర్మం, అహింస, శాంతి, ప్రేమ ఇవే సత్ కర్మలని, వీటి ఆచరణ ద్వారా భగవంతుడికి భక్తుడిగా దగ్గరయి మోక్షం ద్వారా ముక్తిని పొందెదమన్నాడు. ఈ సందర్భంగా పుస్తక సమీక్షలు జరిగినవి, అందులో భాగంగా గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెడ్మాస్టర్(రి) సిద్దిపేట పుస్తక సమీక్ష చేస్తూ మాట్లాడారు- పెందోట వెంకటేశ్వర్లు 60వ ఏటా 60వ షష్టిపూర్తి పుస్తకావిష్కరణ జరిగిన "ఉత్సాహ రామాయణం" లో శ్రీ రాముని విద్యభ్యాసంలో -గురువశిష్టలు ఎప్పుడు… అను గురుశిష్య సంబంధం తెలుపు పద్యం, భద్రాచలంలో "శ్రీరామ నవమి పండగ" తర్వాత రోజు "శ్రీ సీతారాముల పట్టాభిషేకము" జరిగిన సందర్భానికి సంబంధించిన పద్యాలను సభలో వినిపించారు. తర్వాత పెందోట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులచే ప్రముఖకవులను, పుస్తకసమీక్షకులను ఘనంగా సన్మానించారు. ప్రముఖ కవులు- తాటికొండ విష్ణుమూర్తి, ఇప్ప ఉమారాణి, దుడుగు నాగలత, కాల్వ రాజయ్య, అనిశెట్టి సతీష్, అల్లా అశోక్ కుమార్, ఎర్రోజు వెంకటేశ్వర్లు, ఎలికట్టె ఐలయ్య, సుందరకాండ సత్యనారాయణ, యోగానంద మౌనస్వామి, బండికాడ అంజయ్యగౌడ్, తాటి కిషన్, గోపాల్, అంకం రాజేశం, పెద్ది వేణు తదితరులoదరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.