
రాష్ట్రంలో అమలును నిలిపివేయాలి.టి యు సి ఐ డిమాండ్.
జనం న్యూస్ మార్చ్ 31 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల ను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో వాటి అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ధర్నా చౌక్ వద్ద సోమవారం 4 లేబర్ కోడ్ ల ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయబోతుందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్ ల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు ఊడిగం చేసేలా, కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసిందన్నారు. ఈ కోడ్ లు అమలైతే దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోతారన్నారు. పని గంటలు పెరిగి, వారి న్యాయమైన డిమాండ్లను, సమస్యలను కూడా పరిష్కరించుకోలేని పరిస్థితికి నెట్టబడతారన్నారు.ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చట్టాలను అమలును నిలిపివేయాలన్నారు. లేనిచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా నాయకులు సాయరెడ్డి, కిరణ్, రవి, గంగాధర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కే.గంగాధర్, ఒడ్డెన్న, నసీర్, సాయిబాబా, టియుసిఐ నాయకులు విజయ్ కుమార్, శాంతి కుమార్, అమూల్య, పద్మ, గంగాధర్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.