సంగారెడ్డి (జనం న్యూస్ 10జనవరి 25 ప్రతినిధి :మల్లేష్ ):- తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ గురువారం నాడు డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయ సేకరణకు గాను క్యూ ఆర్ కోడ్ ను ఆవిష్కరించినట్లు జిల్లా ఎస్పీ రూపేష్ వివరించారు.గతంలో పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న సేవలపై ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించేవారు, కానీ ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నేరుగా పోలీసుల వ్యవహార శైలి ఎఫ్.ఐ.ఆర్ నమోదు, ఈ చాలన్, మీ సేవ అప్లికేషన్స్ పాస్పోర్ట్ వంటి తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి గానుకోడు అందుబాటులో ఉంటుందని, స్వేచ్ఛగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా జిల్లా ఎస్పీ కోరారు. మీ అభిప్రాయాలకు విలువనిచ్చి మరిన్ని ఉత్తమ సేవలు అందించడానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు.