
జనం న్యూస్ మార్చి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అసెంబ్లీ ముట్టడిలో భాగంగా తెలంగాణ ఉద్యమకార్ల ఫోరం హానుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు కొమ్ముల శివ శాయంపేట గ్రామ టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ యూత్ మండల అధ్యక్షుడు ముంజాల నాగరాజు మండల ఉపాధ్యక్షుడు ఎండి రఫీ మండల కార్యదర్శి రాజ్ మహమ్మద్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోడి శెట్టి గణేష్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇంత భయం ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళకు కనీస గౌరవం లేకుండా పోతుందని తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న హామీలు గౌరవ వేతనం ఇట్టి స్థలం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రెండున్నర సంవత్సరాలు అవుతున్న కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా తెలంగాణ ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ సర్కార్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు ఏ వర్గానికి కూడా సరైన న్యాయం చేస్తా లేదని ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజా పాలన చేయాలని డిమాండ్ చేశారు…..