
జనం న్యూస్- మార్చి31- నాగార్జునసాగర్ టౌన్-
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పిఎఫ్) పోలీసుల ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ డౌన్ పార్క్ ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పార్క్ పరిసర ప్రాంతాల్లో చెత్తనంతా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందించారు, అనంతరం ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డివి భాస్కరరావు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది ఒక్కరోజు చేసే పని కాదు అని ఒక నిరంతర ప్రక్రియ అని ప్రతి పౌరుడు తన ఇంటి చెత్తను వేరుచేసి మునిసిపల్ వాహనానికి అందించినప్పుడే స్వచ్ఛభారత్ కార్యక్రమం సంపూర్ణమవుతుందని అన్నారు. డ్యామ్ ఆర్ఐ జి శ్రీనివాసరావు, జెన్కో ఆర్ ఐ ప్రతాప్ నాయుడు లు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు అని ప్రతి పౌరుడి బాధ్యత అని మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాం డౌన్ పార్క్ వద్ద ఎస్ పిఎఫ్ పోలీసులు నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఎంతో అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రహదారులను శుభ్రపరచడం పాలిశుద్ధ్యమే మెరుగుపరచడం లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నందికొండ మున్సిపాలిటీ వాసులందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి తమ ఇంటి చెత్తను మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలలో మాత్రమే వేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మహారాజుల సేవా సంఘం వారు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి ఏఈ నరసింహమూర్తి, బీసీ సెల్ అధ్యక్షులు రామదాసు, రాజేష్, మహారాజుల సేవా సంఘం సభ్యులు నకులరావు, బద్రి, వీరబాబు, పుల్లారావు, రవితేజ మరియు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.