
జనం న్యూస్ మార్చి 31, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం,
పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ… పరిగి మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజ్, తాగునీటి వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.ప్రతి వార్డుకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్,మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య,వైస్ చైర్మన్ హనుమంతు, కౌన్సిలర్,మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.