
మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు-ఎస్సై ముత్తయ్య
పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు ఎరైవ్ అండ్ ఎలైవ్ ప్రోగ్రాం పై అవగాహన
జనం న్యూస్- మార్చి 31- నాగార్జున్ సాగర్ టౌన్-
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు విజయపురి టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం మరియు రోడ్డు భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం అనేది ఒక విష వలయం అని సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపి ఆలోచన శక్తిని హరిస్తుందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడల పై తమ దృష్టి ఉంచాలని, రోడ్డు భద్రత మరియు బాధ్యతయుతమైన డ్రైవింగ్ పై విద్యార్థులు దృష్టి పెట్టాలని అన్నారు. సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడమే(ఎరైవ్ ) కాకుండా ప్రాణాలతో ఇంటికి రావడం(ఎలైవ్) కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఐలయ్య, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ శంకర్ బాబు, జావేద్, సతీష్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.