
జనం న్యూస్ 31 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని MPPS సుల్తాన్ పూర్ తండ పాఠశాలలో సీతారాములు భార్య హిందు పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు exams ప్యాడ్స్,పెన్స్,పెన్సిల్,తదితర సామగ్రిని,మరియు విద్యార్థులకు భోజనాలు పంపిణీ చెయ్యడం జరిగింది .ఈసందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. నేను గత సంవత్సరం పెళ్లి చేసుకోవడం జరిగింది. మాతో మాఫ్యామిలీ తో కలసి మా భార్య మొట్టమొదటి పుట్టినరోజు ఇలా విద్యార్థుల కు మాకుతోసిన కాడికి సహాయంచెయ్యాలని అనుకున్నాము. అదేవిధంగా మేము మా గ్రామంలోని విద్యార్థులకు మా కుటుంబసభ్యులతో కలసి చిరు సహాయాన్ని చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశా ప్రధానోపాధ్యాయులు MD యూసుఫ్, ఉపాద్యాయులు మంచనపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరుపున సీతారాములుకు చిరు సన్మానం చెయ్యడం జరిగింది.