
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, బిజెపి సీనియర్ నాయకులు అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.స్వామివారి అర్చక స్వాముల పర్యవేక్షణలో ఘనంగా జరిగిన అభిషేకం, అర్చన, హారతుల్లో పాల్గొని అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షాలను అందుకున్నారు.“అయ్యప్ప స్వామి జయంతి అనేది నియమానికి, ధర్మానికి, భక్తికి ప్రతీక. పంగుని ఉత్తిరం పర్వదినం మనలోని దైవత్వాన్ని మేల్కొలిపే పవిత్ర ఘడియ. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కలగాలని రాజేశ్వరరావు అయ్యప్ప స్వామిని ప్రార్థించారు.
