
బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో బుధవారం రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సర్పంచ్ జై కుమార్, డీలర్ బస్వంత్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్,మే, జూన్ నెలకు సరిపడే మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని కావున లబ్ధిదారులు సకాలంలో తీసుకొని వెళ్లగలరని కోరినారు. ఎండాకాలం దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నదని కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు సాయిలు. రేషన్ డీలర్ గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.